అదితి ను ఫైనల్ చేసిన మహా సముద్రం టీమ్

Tuesday, October 13th, 2020, 12:24:53 AM IST

RX 100 చిత్రం తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి తన నెక్స్ట్ చిత్రం మహా సముద్రం కోసం పక్క ప్రణాళిక తో దూసుకు పోతున్నాడు. ఈ చిత్రం కి హీరోయిన్ విషయం లో నేటికీ ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం లో హీరో శర్వానంద్ సరసన కథానాయికగా అదితి రావు హైదార ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. ఈ చిత్రం లో హీరో శర్వానంద్ తో పాటుగా సిద్ధార్ద్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు.

సరైన హాట్ లేక సతమతమవుతున్న నటుడు శర్వానంద్, ఈ చిత్రం తో ఏళ్ల అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తెలుగు లో అదితి రావు హైదర్ ఇటీవల విడుదల అయిన వి చిత్రం సైతం అభిమానులను నిరాశ పరిచింది. ఈ చిత్రం తో అయినా మంచి ఫాం లోకి రావాలని చూస్తున్నారు.