ఆదిపురుష్ విడుదల తేదీని ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చిన చిత్ర యూనిట్!

Thursday, November 19th, 2020, 08:10:05 AM IST

భారీ బడ్జెట్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ చిత్ర విడుదల తేదీని ఆ టీమ్ ప్రకటించింది. గురువారం ఉదయం 07:11 గంటలకు ప్రకటించేసింది. ఈ ఆదిపురుష్ చిత్రాన్ని ఆగస్ట్ 11, 2022 న విడుదల చేసేందుకు సిద్దం అయింది. అయితే ఈ చిత్రాన్ని 3డీ లో కూడా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు.

ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రం తో బిజీగా ఉన్న ప్రభాస్, అనంతరం నాగ్ అశ్విన్ తో కూడా ఒక చిత్రాన్ని చేయనున్నారు. ఆదిపురుష్ చిత్రం వచ్చే ఏడాది జనవరి లో సెట్స్ మీదికి వెళ్ళే అవకాశం ఉండగా, ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.