తప్పతాగి చీఫ్ గెస్ట్ గా వచ్చిన నటి!

Tuesday, April 28th, 2015, 07:46:37 PM IST

Urvashi
ప్రముఖ దక్షినాది నటీమణి ఊర్వశి మరోసారి తప్పతాగి వార్తల్లో కెక్కింది. ఇక నటన పరంగా ఎన్నో అవార్డులను అందుకున్న ఈ నటి ప్రవర్తన విషయానికి వచ్చే సరికి ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. కాగా తన విడాకుల కేసు సమయంలోనూ ఆమె తాగి ఫ్యామిలీ కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ప్రజాప్రతినిధుల సమావేశానికి ఊర్వశి తప్పతాగి ముఖ్య అతిధిగా విచ్చేసింది.

ఇక వివరాలలోకి వెళితే ఎల్డీఎఫ్ ఆధ్వర్యంలో కేరళ ఫిమేల్ లెజిస్లేటివ్ స్టాఫ్ అసోసియేషన్ సమావేశానికి ఊర్వశిని అతిధిగా ఆహ్వానించారు. ఇక రావడమే ఆలస్యంగా వచ్చిన సదరు నటి అటుపై స్టేజ్ ఎక్కి నోటికి వచ్చినట్లు వాగేసరికి సభ్యులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారట. అలాగే అప్పటికే మద్యం కిక్కు నషాళానికి ఎక్కడంతో ఆమెను స్టేజి మీద నుండి కిందకు దింపి పంపేసరికి నిర్వాహకులకు తల ప్రాణం తోకకు వచ్చిందట. ఇక ఊర్వశి నిర్వాకానికి నోరెళ్ళబెట్టిన నిర్వాహకులు వేరే అతిధితో సమావేశం కానిచ్చినట్లు సమాచారం తెలుస్తోంది.