వైరల్ : ముంబై ఆటో రిక్షాలో అద్భుత దృశ్యం..!

Wednesday, July 15th, 2020, 10:57:08 AM IST

ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రకృతిని మనం డిస్టర్బ్ చేస్తే అది కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. కానీ దాని పరిణామాలు మాత్రం ఊహించని రీతిలో ఉంటాయి. మనం ప్రకృతికి ఏదైతే ఇస్తున్నామో తిరిగి మళ్లీ అదే మనకు ప్రకృతి అందిస్తుంది అన్న మాట ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.

కానీ నిజంగా ప్రకృతిని ప్రేమించేవారు అతి తక్కువ హాని చేసే వారు నిజంగానే తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. అలా ఇప్పుడు కరోనా దెబ్బకు మనుషులకు పెద్ద బ్రేక్ ఇచ్చి కొన్నాళ్ళు పాటు హీల్ అయ్యింది. అందుకే ఈ ఈరోజుల్లో ప్రకృతిని గౌరవిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి అని సింబాలిక్ గా ఓ ముంబై ఆటో రిక్షా నడుపుకునే అతను తెలుపుతున్నాడు.

తన డ్రైవింగ్ సీట్ లో ఒక వాటర్ క్యాన్ పెట్టి అందులో నీటితో ఒక పైప్ ద్వారా లింక్ ఇచ్చి తన ఆటో ఎక్కేవారు చేతులు కడుక్కుని విధంగా ఒక సింక్ ను ఏర్పాటు చేశాడు. పైగా దాని కింద నుంచి నీరు వృధాగా పోకుండా ఆ కింద చిన్న పాటి కుండీలలో మొక్కలను ఏర్పాటు చేశాడు.

ఈ ఆలోచన మాత్రం అద్భుతంగా ఉంది కదా.. వీటితో పాటుగా ఒక శానిటైజర్ ను కూడా అతను ఏర్పాటు చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రముఖ నటి నదియా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.