మీరా చోప్రా ను వేదిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు… సైబర్ పోలీసులకు ఫిర్యాదు!

Wednesday, June 3rd, 2020, 10:33:16 AM IST

తెలుగు సినీ పరిశ్రమ లో ప్రతి ఒక్క స్టార్ హీరో కి భారీ గా అభిమానులు ఉన్నారు. అయితే అంత కలిసే ఉన్నా, కొన్ని సార్లు మాత్రం తమ అభిమాన నటుడిని ఏమైనా అంటే కొంచెం ఘాటుగా స్పందిస్తారు. అయితే మీరా చోప్రా విషయం లో మాత్రం అభిమానులు హద్దులు మీరారు. సోషల్ మీడియా లో ఎక్కువగా యాక్టిివ్ లో ఉండే మీరా చోప్రా, #askmeera పేరిట అభిమానులతో చిట్ చాట్ చేశారు. అయితే ఇందులో ఒక నెటిజన్ ఎన్టీఆర్ గురించి ఏదైనా చెప్పండి అని అడగ్గా, నాకు ఆయన గురించి తెలియదు, నేను ఆయనకు అభిమాని నీ కాదు అని అన్నారు.

అయితే మీరా చోప్రా ఇచ్చిన సమాధానం తో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇష్టారీతిన అసభ్య పదజాలంతో దుషిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం పై నటీ మీరా చోప్రా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలం తో దూషించిన వారు ట్విట్టర్ ఖాతాలను, కామెంట్ లని స్క్రీన్ షాట్ తీసి, తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు.అయితే వారంతా ఎన్టీఆర్ అభిమానులు అని పోస్ట్ లో వెల్లడించారు. అంతేకాక జూనియర్ ఎన్టీఆర్ ఖాతా కి కూడా ఈ పోస్ట్ ను ట్యాగ్ చేశారు మీరా చోప్రా.తనను మీ అభిమానులు వేధిస్తున్నారు అని, ఇలాంటి అభిమానులు ఉంటే మీకు విజయం వరిస్తుందని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. అయితే నటి మీరా చోప్రా ఫిర్యాదు చేయడం తో పెద్ద ఎత్తున నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.