కాజల్ అగర్వాల్ చేసుకొబోయేది ఇతన్నేనా?

Monday, October 5th, 2020, 11:13:58 PM IST

అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లికి సిద్దం అయినట్లు తెలుస్తోంది. అయితే కాజల్ చేసుకోబోయే వ్యక్తి ఇతనే అంటూ సోషల్ మీడియా లో పోస్టులు చాలా వైరల్ గా మారాయి. ఇప్పటికే కాజల్ అగర్వాల్ కి రహస్యం గా నిశ్చితార్థం కూడా జరిగింది అని పలు వార్తలు వస్తున్నా ఇప్పటి వరకు కాజల్ అగర్వాల్ వాటిని ఖండించలేదు, ఏ విధంగా కూడా స్పందించలేదు.

అయితే ముంబై కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతం కిచ్లు ను కాజల్ అగర్వాల్ వివాహమాడనున్నట్లు సోషల్ మీడియా లో పోస్ట్ లు వైరల్ గా మారాయి. అయితే లాక్ డౌన్ పూర్తిగా అయిపోయిన అనంతరం ముంబై లోని ఒక హోటల్ లో వీరి వివాహం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హజరు కానున్నట్లు సమాచారం. కాజల్ అగర్వాల్ సైతం గౌతం కిచ్లూ పోస్టులను లైక్ చేయడం తో ఈ అనుమానాలు మరింత గా పెరిగాయి. మరి వీటి పై కాజల్ అగర్వాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.