“మహా సముద్రం” లోకి సిద్ధార్ద్ ఇన్…సమంత ఔట్!

Friday, September 18th, 2020, 09:23:35 PM IST


టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో తాను తీసిన ఓకే ఒక్క చిత్రం తోనే సెన్సేషన్ క్రియేట్ చేసారు అజయ్ భూపతి. RX 100 చిత్రం యువత ను ఉర్రూతలూగించడం మాత్రమే కాకుండా, ఆలోచించేలా చేసిన ప్రేమ కథా చిత్రమ్. అయితే మరొక డిఫెరెంట్ కథాంశం తో అజయ్ భూపతి సిద్ధమయ్యారు. అయితే మొదట గా ఈ చిత్రానికి సంబంధించిన కథను నాగ చైతన్య, సమంత లకు వినిపించగా ఇద్దరూ కూడా ఓకే చెప్పారు.

అయితే ముందు నాగ చైతన్య వరుస ప్రాజెక్ట్ ల కారణం చేత చిత్రం నుండి తప్పుకోగా, కొద్ది రోజుల అనంతరం సమంత కూడా తప్పుకున్నారు. అయితే శర్వానంద సరసన కథానాయికగా ఐశ్వర్య రాజేష్ నటించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ చిత్రం లో మరొక కీలక పాత్ర కోసం నటుడు సిద్ధార్ద్ ను సంప్రదించగా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సిద్ధార్ద్ చాలా ఏళ్ల విరామం తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమా లో నటిస్తున్నారు. మొత్తానికి సిద్ధార్ద్ ఎంట్రీ కొందరిలో ఆసక్తిని కలిగించే విషయం అని చెప్పాలి.

మరి ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఇంకా ఆసక్తికరం గా ఉంటుంది అని, మెల్లమెల్లగా అన్ని రివీల్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.