సత్యదేవ్ మరో క్రేజీ ప్రాజెక్ట్… హీరోయిన్ గా తమన్నా!

Saturday, August 29th, 2020, 02:16:04 AM IST


ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య అంటూ భిన్నమైన కథ తో సత్యదేవ్ అలరించాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలం లోనే ఎంతో పేరు తెచ్చుకున్న ఈ నటుడు, తాజాగా తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. గుర్తుందా శీతాకాలం అంటూ మరొక డిఫెరెంట్ కథ తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్దం అయ్యారు. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ గా మిల్క్ బ్యూటీ తమన్నా నటించనుంది. ఇదే విషయాన్ని నటుడు సత్యదేవ్ వెల్లడించారు. నాగ్ శేఖర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం ను నాగ్ శేఖర్ తో పాటుగా భవనరవి నిర్మించనున్నారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తం షాట్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రం విజయం సాధించడంతో మంచి జోష్ లో ఉన్న సత్యదేవ్ మరొక క్రేజీ ప్రాజెక్ట్ తో దూసుకుపోతున్నారు.