‘రామ్ చరణ్’ కి కరోనా వైరస్ పాజిటివ్

Tuesday, December 29th, 2020, 08:16:24 AM IST

కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ కూడా విడిచి పెట్టడం లేదు. ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం తో పాజిటివ్ కేసులు కూడా ఇంకా రాష్ట్రాల్లో నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ కరోనా వైరస్ భారిన పడ్డారు. తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోగా అందులో రామ్ చరణ్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తనని గత రెండు రోజులుగా కలిసి ఉన్న వారు, సన్నిహితంగా ఉన్నవారు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని రామ్ చరణ్ సూచించారు. అయితే తనకు ఎటువంటి కరోనా వైరస్ లక్షణాలు లేవు అని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే కోలుకొని మరింత బలంగా తిరిగి వస్తా అంటూ అభిమానులకు తెలిపారు. అయితే రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు.