ఆసుపత్రి లో చేరిన “థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ రాజ్”

Wednesday, August 5th, 2020, 02:11:47 AM IST


నటుడు పృథ్వీ రాజ్ తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు. ఈ విషయాన్ని తానే స్వయంగా సేల్ఫీ వీడియో తో సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే తనకు జలుబు తో పాటుగా, తీవ్ర అనారోగ్యం గా ఉన్నట్లు వీడియో లో తెలిపారు. అయితే కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. అయితే అందులో కరోనా నెగటివ్ అని తేలింది. అయినప్పటికీ వైద్యుల సలహా మేరకు క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే సెల్ఫి వీడియో లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ బాధపడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. వైద్యులు 15 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి అని చెప్పిన విషయాన్ని వెల్లడించారు. అందుకోసమే ఆసుపత్రి లో చేరా అని అన్నారు. అయితే త్వరగా కోలుకోనేందుకు అందరి ఆశీస్సులు కావలి అని అన్నారు. అంతేకాక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఉండాలి అని మనస్పూర్తి గా కోరుకుంటున్నా అని అన్నారు. అయితే నటుడు గా, కమెడియన్ గా కెరీర్ ను కొనసాగిస్తూనే ఎస్విబీసి చైర్మన్ గా కొద్ది రోజులు వ్యవహరించారు పృథ్వీ రాజ్. అయితే పలు కారణాల చేత ఆ పదవికి రాజీనామా చేశారు.