మనందరం కోవీడ్ టైమ్స్ లో ఉన్నాం – నాని

Tuesday, August 4th, 2020, 02:41:34 AM IST


కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రోజుకి మన దేశం లో వందల మంది ప్రాణాలను కోల్పోతున్నారు. వేల సంఖ్యలో కరోనా వైరస్ భారిన పడుతున్నారు. అయితే కరోనా వైరస్ భారిన పడి కోలుకున్న వారి లో యాంటీ ఆక్సిడెంట్లు పని తీరు బాగుంటుంది అని, ప్లాస్మా థెరపీ ను ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తున్నారు. అయితే తాజాగా ప్లాస్మా దానం పై పలువురు సెలబ్రిటీ లు, ప్రముఖులు డొనేట్ చేయడం జరిగింది. అంతేకాక ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి సైతం ప్లాస్మా దానం చేస్తా అని వ్యాఖ్యానించారు. అయితే తాజాగా నేచురల్ స్టార్ నాని ఈ ప్లాస్మా దానం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇపుడు మనం అందరం కరోనా టైమ్స్ లో ఉన్నాం అని అన్నారు.కొన్ని లక్షల మంది ఈ వైరస్ భారిన పడి, అదే విధంగా లక్షల మంది కరోనా నుండి కోలుకున్నారు అని గుర్తు చేశారు. అయితే కోవిడ్ వలన ఎక్కువగా ప్రభావితం అయిన వారికి ప్లాస్మా అవసరం అని అన్నారు.మీరు దానం చేసే 500ml ప్లాస్మా ఇద్దరి ప్రాణం కాపాడుతుంది అని అన్నారు. ఈ చిన్న సాయం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని, ప్లాస్మా మళ్లీ రెండు రోజుల్లో తయారు అవుతుంది అని అన్నారు. అయితే దానం చేయాలి అనుకున్న వారు 9490617440 కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకొండి అని అన్నారు.