నాగబాబు కి సోకిన కరోనా… కళ్యాణ్ దేవ్ ఏమన్నారంటే?

Wednesday, September 16th, 2020, 03:45:57 PM IST

Nagababu

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ప్రపంచ దేశాలను భయ పెడుతున్న ఈ మహమ్మారి ప్రభావం భారత్ లోనే ఎక్కువగా ఉంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల తో పరిస్థితి మరింత ఆందోళన కారంగా మారింది. అయితే అన్ని రంగాల వారితో పాటు గానే, ప్రజా ప్రతినిదులు, సినీ పరిశ్రమ కి చెందిన వారిని కూడా ఈ మహమ్మారి విడిచి పెట్టడం లేదు.

తాజాగా నటుడు నాగబాబు కరోనా వైరస్ భారిన పడ్డారు. ఒక వ్యాధి వచ్చిందని బాధపడటం కాదు అని, దాని నుండి కోలుకొని వేరొకరికి సహాయం చేయాలని తెలిపారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అని,సరైన జాగ్రత్త చర్యలు పాటించి, కరోనా ను ఎదుర్కొని ప్లాస్మా దాతగా మారతాను అని తెలిపారు. అయితే నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలకు అభిమానులు స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే నాగబాబు చేసిన పోస్ట్ పై కళ్యాణ్ దేవ్ స్పందించారు. నాగబాబు మావయ్య మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని తెలిపారు.నాగబాబు కూడా స్పందించారు. నేను ఆరోగ్యం గా ఉండాలి అని కొరుకున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు. అయితే దర్శకుడు మారుతి సైతం త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేసారు.