మెగా, నందమూరి అభిమానులను ఫుల్ జోష్ లో నింపిన నాగబాబు!

Monday, September 14th, 2020, 08:42:52 PM IST


టాలీవుడ్ లో మెగా హీరోలకు, నందమూరి అభిమానులకు భారీగా అభిమానులు ఉన్నారు. అయితే అప్పుడప్పుడు వీరు ఒకరి పై మరొకరు విమర్శలు చేస్తూనే ఉన్నా, తామంతా ఒక్కటే అంటూ చివరికి అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు. అయితే తాజాగా మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు సోషల్ మీడియా లో ఒక ఆసక్తికర ఫొట్ ను షేర్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

పవర్ స్టార్ మొదటి సారి గా, నందమూరి సింహం ను కలిసినప్పుడు తీసిన ఫోటో ఇది అంటూ నాగబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ లు ఇద్దరు ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇస్తూ దిగిన ఫోటో ఇది. అయితే నందమూరి బాలకృష్ణ అభిమానులు మాత్రం బాలయ్య స్లొగన్స్ తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ రాజకీయాల పరం గా ఇతర పార్టీ లకు చెందిన వారు. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గా బాలకృష్ణ వ్యవహరిస్తూ ఉండగా, పవన్ కళ్యాణ్ సొంత పార్టీ జన సేన అధ్యక్షుడు గా ఉన్నారు. సినిమాల్లో కొనసాగుతూనే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.