పుష్ప చిత్రం లో ఆ స్టార్ నటుడు…క్లారిటీ వచ్చేసింది!

Thursday, October 1st, 2020, 02:05:54 AM IST


సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం కి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ చిత్రం లో కీలక పాత్ర లో నటించాల్సిన విజయ్ సేతుపతి అనివార్య కారణాల తో తప్పుకోవడం తో ఈ చిత్రం లో విలన్ పాత్రలో ఎవరూ కనిపిస్తారు అనే విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో కొందరు ప్రముఖుల పేర్లు వినిపించాయి. తాజాగా స్టార్ నటుడు మాధవన్ పేరు కూడా వినబడింది. అయితే ఈ విషయం పై మాధవన్ స్పందించారు.

సోషల్ మీడియా లో మరియు మిగతా వార్తల్లో నిజం లేదు అని, పుష్ప చిత్రం లో విలన్ పాత్రలో చేయడం లేదు అని స్పష్టం చేశారు. అల వైకుంఠ పురం లో చిత్రం తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్, పుష్ప చిత్రం ను పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్నారు. తెలుగు లో మాత్రమే కాకుండా, మిగతా బాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొనడం తో ఇందుకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా వైరల్ మారుతోంది.