హాట్ టాపిక్: మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య!

Tuesday, June 2nd, 2020, 08:29:07 AM IST

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తో సినీ పెద్దలు జరిపిన చర్చల పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలయ్య చేసిన వ్యాఖ్యల పై ఒక పక్క చర్చలు జరుగుతుండగానే, మరొకసారి ఇండస్ట్రీ పైన, ప్రభుత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై ఘాటు విమర్శలు చేశారు బాలయ్య. మా కోసం బిల్డింగ్ కడతామని అన్నారు, అమెరికా వెళ్లారు, నన్ను ఏమైనా పిలిచారా అని సూటిగా ప్రశ్నించారు. చిరంజీవి గారు అంతా కలిసి అమెరికా వెళ్ళారు, అక్కడ ఫంక్షన్ చేశారు, మొత్తం అయిదు కోట్లు అన్నారు, అయితే అందులో నేను ఇన్వాల్వ్ కాను అని వ్యాఖ్యానించారు.

అయితే ఆర్టిస్ట్ అనేవాడు ఎపుడు ప్రకాశవంతంగా అందంగా కనపడాలి అని అన్నారు. అయితే ఇవన్నీ పక్కన పెట్టి, ఇవాళ కట్టారా బిల్డింగ్ అని మా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇపుడు ప్రభుత్వం కూడా సపోర్ట్ గా ఉంది అని, మా కోసం రెండు, మూడు ఎకరాల భూమి ఫ్రీగా ఇవ్వరా అని వ్యాఖ్యానించారు. అయితే ఇండస్ట్రీ నుండే ఎక్కువగా టాక్స్ కలెక్ట్ చేస్తున్నారు అని, అందుకే కరోనా వైరస్ మహమ్మారి ఉన్నప్పటికీ షూటింగ్స్ మొదలుపెట్టారు అని వ్యాఖ్యానించారు.

అయితే ప్రస్తుతం సమాజం లో కూడా ఎక్కువగా టాక్స్ పే చేస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ అని అన్నారు. ఇంతవరకు భవనం నిర్మించలేదు అని ఎద్దేవా చేశారు. అదే చెన్నై నీ చూడండి,మేం డబ్బులు పెట్టీ కట్టుకొలేమా అంటూ వారి నీ పొగుడుతునే, ఇటు విమర్శలు చేశారు.అయిదు కోట్లు అన్నారు, తర్వత కోటి అన్నారు, మిగతా నాలుగు కోట్లు ఏమి అయ్యాయి అని నిలదీశారు.వీటన్నిటి కోసం ఎవడు కూర్చుంటాడు. ఏమన్నా లెక్కల మాస్టార్ల అని అన్నారు. హిపోక్రసీ, సైకొఫాన్సి లు ఎక్కువ అని, మైకులు చూడగానే పిచ్చెక్కుతుంది కొందరికి అంటూ ఘాటు గా విమర్శలు చేశారు.మరి ఈ వ్యాఖ్యల పై ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.