కరోనా కి అసలు వాక్సిన్ వచ్చే అవకాశాలు లేవు…బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Monday, November 16th, 2020, 01:33:09 PM IST

mla_balakrishna

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను భయ పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మహమ్మారి కి ఇంకా వాక్సిన్ అందుబాటులో లేదు. అయితే నటుడ బాలకృష్ణ తాజాగా ఈ కరోనా వాక్సిన్ కి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా కి వాక్సిన్ లేదు, అసలు రాదు అంటూ బాలకృష్ణ అన్నారు. సేహరీ సినిమా ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసిన నటుడు బాలకృష్ణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే మనం జాగ్రత్తగా ఉండాలి అని, వాక్సిన్ వస్తుంది అని అంటున్నారు అది నిజం కాదు అంటూ బాలకృష్ణ అన్నారు. అసలు వాక్సిన్ వచ్చే అవకాశాలు లేవు అని, కరోనా మన జీవితాంతం ఉంటుంది అని, దాంతో మనం సహ జీవనం చేయాల్సిందే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నుండి కార్తీక సోమవారం, అయినా సరే తల స్నానాలు చేయవద్దు అంటూ సూచించారు. అయితే నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఒక పక్క ప్రపంచ దేశాలు వాక్సిన్ ను అభివృద్ది చేసేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు.