జనవరి 26 న విడుదల కానున్న ఆచార్య టీజర్?

Thursday, January 21st, 2021, 08:34:19 AM IST

మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల అయినప్పటి నుండి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఈ నెల 26 వ తేదీన విడుదల కానున్నట్లు తెలుస్తోంది. జనవరి 26 వ తేదీ టీజర్ విడుదల కి కరెక్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చిత్రం షూటింగ్ లో తాజాగా రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. ఈ చిత్రం లో రామ్ చరణ్ సిద్ధ గా కనిపించనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సై రా నరసింహ రెడ్డి తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడం పట్ల అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం గతేడాది విడుదల కావాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడింది. ఈ చిత్రం విడుదల పై కూడా త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.