ఆచార్య చిత్రం కథ కొరటాల శివ దే!

Thursday, August 27th, 2020, 09:59:19 PM IST


మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు న విడుదల అయిన ఆచార్య చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రానికి వస్తున్న భారీ క్రేజ్ కారణంగా నే కొందరు రచయితలు ఆచార్య చిత్రం కథ మాది అంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అని చిత్ర యూనిట్ తాజాగా అఫిషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. దీని పై వస్తున్న పలు రూమర్ ల పై క్లారిటీ ఇవ్వడం జరిగింది.

అయితే ఆచార్య కథ మాది అంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు అని, ఇది ఒరిజినల్ కథ అని పేర్కొన్నారు. అంతేకాక ఈ కథ పూర్తిగా కొరటాల శివకు మాత్రమే చెందుతుంది అని అన్నారు. తాజాగా రిలీజ్ చేసి ఆ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కి మంచి క్రేజ్ వచ్చింది అని, ఈ క్రేజ్ చూసి కొందరు రచయితలు ఇది వారి కథే అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు. అంతేకాక వాస్తవానికి ఈ సినిమా గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని, కేవలం మోషన్ పోస్టర్ చూసి కథ మాది అని అనుకుంటున్నారు అని కొరటాల శివ లాంటి దిగ్గజ దర్శకుల పై ఇటువంటి ఆరోపణలు చేయడం తగదు అని తెలిపారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ కి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.