మెగాస్టార్ “ఆచార్య” ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్

Tuesday, August 18th, 2020, 05:04:49 PM IST

Chiru_152

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు దగ్గరకు వస్తుండటంతో ఆచార్య చిత్ర యూనిట్ ఒక సూపర్ గిఫ్ట్ ను సిద్దం చేసింది. ఆచార్య చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను మోషన్ పోస్టర్ ను ఆగస్ట్ 22 సాయంత్రం నాలుగు గంటలకు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి దేవాదాయ శాఖ కి చెందిన ఉద్యోగి లా కనిపించనున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. సై రా నరసింహ రెడ్డి చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం కావడం తో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఎట్టకేలకు రాబోతుందటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వాయిదా పడటం తో విడుదల ఆలస్యం కానుంది. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.