బిగ్ న్యూస్ : సీఎంకు విన్నవించి ఉరేసుకున్న ప్రముఖ నిర్మాత!

Tuesday, March 24th, 2020, 02:55:11 PM IST


మన దక్షిణాదిలో ఉన్న సినీ ఇండస్ట్రీ ఇప్పుడు మన దేశంలోనే అతి పెద్ద లాభాలు తెచ్చిపెట్టే సినీ పరిశ్రమగా మారింది. అందులో ముఖ్యంగా మన టాలీవుడ్ మరియు కోలీవుడ్ లతో సహా “కేజీయఫ్” తో కన్నడ సినీ పరిశ్రమ కూడా ఆ లిస్ట్ లో అడుగు పెట్టింది. అయితే ఇదే కన్నడ పరిశ్రముకు చెందిన ఒక ప్రముఖ నిర్మాత తమ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక సూసైడ్ వీడియో పెట్టి ఆత్మ హత్య చేసుకోడం అక్కడ కలకలం రేపింది.

కాపాలి మోహన్ అనే వ్యక్తి అక్కడ పలు చిత్రాలను నిర్మించడమే కాకుండా బిజినెస్ మెన్ గా కూడా స్థిరపడ్డారు. కానీ తన హోటల్ తన బాధలను చెప్తూ చనిపోయారు.తాను బిజినెస్ లో చాలా నష్టాలు చవి చూశానని వాటి మూలాన ఇప్పుడు చాలా నష్టపోయానని అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నానని తన కుటుంబాన్ని మీరే ఆదుకోవాలి అంటూ కర్ణాటక సీఎంకు విన్నవించుకొని తన హోటల్ రూమ్ లో తానే ఉరి వేసుకొని మరణించారు.