వైరల్ న్యూస్ : చిరు 152లో రామ్ చరణ్ రోల్ ఇదేనా.?

Thursday, February 13th, 2020, 07:43:19 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు భారీ ప్రాజెక్టులలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం కూడా ఒకటి.సైరా నరసింహా రెడ్డి లాంటి ఒక భారీ పవర్ ఫుల్ పీరియాడిక్ డ్రామా తర్వాత బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఒక్క మెగా ఫ్యామిలీ అభిమానుల్లోనే కాకుండా మొత్తం టాలీవుడ్ శ్రేణుల్లోనే భారీ అంచనాలు ఈ చిత్రంపై నెలకొన్నాయి.అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అనేసరికి అవి మరింత ఎక్కువయ్యాయి.

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక పాత్రలో నటిస్తున్నారని కూడా వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.అలాగే ఈ చిత్రం నక్సలిజం బ్యాక్డ్రాప్ లో ఉంటుంది అని మొదట్లో వార్తలు వినిపించాయి.అవి ఎంతవరకు నిజమో కానీ ఇప్పుడు దానికి దగ్గరగా రామ్ చరణ్ రోల్ ఈ చిత్రంలో ఉండబోతుంది అని తెలుస్తుంది.ఈ సినిమాలో చరణ్ ఒక నక్సలైట్ గా కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.మరి నిజంగానే చెర్రీ ఆ రోల్ లో కనిపిస్తారో లేదో చూడాలి.