వెయ్యేళ్ళలో మానవజాతి అంతం..?

Friday, January 22nd, 2016, 10:39:30 AM IST


రోజు రోజుకు సాంకేతిక విజ్ఞానం పెరిగిపోతున్నది. సాంకేతిక విజ్ఞానాన్ని పెంచుకుంటుపోతున్న మనిషి ప్రకృతి సమతుల్యతను మాత్రం పక్కన పెట్టేశాడు. దీంతో భూతాపం పెరిగిపోతున్నది. సంవత్సరం సంవత్సరానికి భూమిపై వేడి పెరిగిపోతున్నది. ఇలా భూమిపై వేడి పెరిగిపోతుండటంతో.. సమతుల్యత లోపించి… వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడం దగ్గరి నుంచి వరదలు.. తుఫానులు.. భూకంపాలు సంభవించడం వరకు అన్నీ అడ్డదిడ్డంగా జరుగుతున్నాయి.

ఇకపోతే, మనిషిలో యుద్దకాండ పెరిగిపోవడంతో.. అణ్వాయుధాలను తయారు చేసుకుంటున్నాడు. ఏదైనా జరగరానిని జరిగి.. ఆ అణ్వాయుదాలు మండితే.. ప్రపంచం మొత్తం తగలబడిపోతుంది. మరోవైపు మనిషి ఎలియన్స్ జాడ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎలియన్స్ తో కనుక సంబంధాలు పెట్టుకుంటే.. మరోసారి మనిషికి ముప్పు వాటిల్లగలదు. భూమిపై ప్రకృతి సమతుల్యత లోపించడంతో.. భవిష్యత్తులో మనిషి మనుగడ ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉన్నది. ఇక, మనిషి ఆవాసం కోసం గ్రహాల అన్వేషణ చేస్తున్నాడు. ఆ అన్వేషణ ఫలిస్తే.. మనిషి అక్కడికి పయనంగాక తప్పదు. ఎందుకంటే.. భూమిపై ఇదే విధంగా సమతుల్యత లోపిస్తే.. రాబోయే వెయ్యేళ్ళలో మానవజాతి అంతం అవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి మనిషి ఇప్పటికైనా భూతాపాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. లేదంటే మాత్రం మనిషి మనుగడ ప్రశ్నార్ధకమే.