తలసానికి హై కోర్టు నోటీసులు

Thursday, November 12th, 2015, 09:34:02 PM IST

తెలంగాణ వాణిజ్య ప‌న్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రి పదవికి తలసాని అనర్హుడంటూ శివప్రసాద్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారన జరిపిన న్యాయస్థానం …తలసాని వివరణ ఇవ్వాలంటూ గురువారం ఆదేశించింది. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.