పోలీసుల ముందు హాజరుకానున్న దిగ్విజయ్ సింగ్

Thursday, October 15th, 2015, 05:12:34 PM IST

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ భోపాల్ పోలీసుల ముందు హాజరుకానున్నారు. మధ్యప్రదేశ్ విధాన సభ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో భాగంగా చేపడుతున్న విచారణలో తన వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన గురువారం పోలీసుల వద్దకు వెళుతున్నారు. జహంగిరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తున్నారు. 1993 నుంచి 2003 మధ్యకాలంలో ఈ కుంభకోణం చేసుకుంది.