రైతులకు చంద్రబాబు అభయ హస్తం

Tuesday, November 26th, 2013, 08:40:38 PM IST

వరుసగా తుఫానులు వచ్చి రాష్ట్రాన్ని అతలా కుతలం చేస్తున్నాయి. ఈ తుఫానుల వల్ల అందరి కంటే ఎక్కువగా నష్టపోయింది రైతులే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి సహాయక చర్యలు అందించడం లేదు. టిడిపి అధినేత ప్రస్తుతం ఈ తుఫాను వల్ల దెబ్బతిన్న పలు ప్రాంతాలకు వెళ్లి అక్కడున్న రైతులను పరామర్శించారు. అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాగానే రైతుల ఋణాలు మాఫీ చేస్తానని మాటిచ్చారు. డెల్టా ఆధునీకరనల్లో కొట్లలో దోపిడీ జరిగింది అందుకే రైతులకు పంట నష్టం జరిగిందని ఆయన అన్నారు.