సర్వత్రా ‘స్వచ్చా భారత్’

Thursday, October 2nd, 2014, 03:40:08 PM IST

దేశవ్యాప్తంగా ఈ రోజు స్వచ్చా భారత్ కు శ్రీకారం చుట్టబడింది. ఢిల్లీలో ప్రధాని మోడీ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా తాను కూడా చీపురు పట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో స్వచ్చా భారత్ ను ప్రారంభించి పాల్గొన్నారు. ఇక దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ ప్రజా ప్రతినిధుల సమక్షంలో స్వచ్చా భారత్ కార్యక్రమానికి పునాది పడింది.