ఐపీఎల్ లో యువరాజ్ రికార్డ్

Monday, February 16th, 2015, 12:03:26 PM IST


ఐపీఎస్ 8 కు ఆటగాళ్ళ కొనుగోలు కార్యక్రమం ఈరోజు జరిగింది. అయితే, గత సీజన్ లో యువరాజ్ సింగ్ ను 14కోట్ల రూపాయలకు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు కైవసం చేసుకున్నది. అయితే, యువరాజ్ సింగ్ అంచనాలకు మించి ఆ సీజన్ లో రాణించలేకపోయాడు. అయినప్పటికీ యువరాజ్ సింగ్ ఫామ్ ఏమాత్రం తగ్గలేదు. యువరాజ్ సింగ్ ను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ముందుకు వచ్చింది. యువరాజ్ సింగ్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రాంచైజీ 16 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

ఇక యువరాజ్ తో పాటు, ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ పించ్ ను, అలాగే, ఇంగ్లాండ్ ఆటగాడు మోర్గాన్ ను కొనుగోలు చేసేందుకు ప్రాంచైజీలు ఉత్సాహం చూపించారు. ఇక, మరో ఆస్ట్రేలియా ఆటగాడు మైక్ హుస్సీ ని చెన్నై సూపర్ కింగ్స్ సంస్థ 1.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం విశేషం. అయితే, సౌత్ ఆఫ్రికా కు చెందిన వరల్డ్ నెంబర్ 2 ఆటగాడు ఆమ్లాను ఏ ప్రాంచైజీ కూడా కొనుగోలు చేయకపోవడం విశేషం.