అక్క‌డ వైసీపీ గెలుపు అంత ఈజీ కాదు.. అంద‌రి చూపూ జ‌గ‌న్ పైనే..!

Thursday, February 28th, 2019, 12:00:45 PM IST

ఏపీలో ఎన్నిక‌లు రానున్న నేప‌ధ్యంలో విజ‌య‌న‌గరం కురుపాం నియోజ‌క‌వ‌ర్గం అసెంబ్లీ సెగ్మెంట్ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

గ‌త ఎన్నిక‌ల్లో కురుపాం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అభ్య‌ర్ధి జ‌నార్ధ‌న్ థాట్రాజ్ పై వైసీపీ అభ్య‌ర్ధి పుష్ప శ్రీవాణి 19 వేల మెజారిటీతో గెలుపొందారు.

దీంతో మ‌రోసారి వైసీపీ త‌రుపున పుష్ప శ్రీవాణికే టిక్కెట్ దక్క‌నుంద‌ని తెలుస్తోంది. ఆయితే ఆమెకు సొంత కుటుంబం నుండే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని తెలుస్తోంది.

2014 ఎన్నిక‌ల త‌ర్వాత చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు లొంగ‌ని పుష్ప‌, వైసీపీనే న‌మ్ముకుంది. దీంతో పాద‌యాత్ర‌లో భాగంగా ఆమెను జ‌గ‌న్ ఆకాశానికి ఎత్తారు.

కుర‌పాం నియోజ‌క‌వ‌ర్గంలో పుష్ప శ్రీవాణికి మంచి పేరే ఉంది. దీంతో ఆమెకు మ‌రోసారి తిరుగుండ‌ద‌ని భావిస్తుండ‌గా, ఆమెకు ఇంటుపోరు త‌ల‌పోటుగా మ‌ర‌నుంది.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే పుష్పా శ్రీవాణి మామ శ‌త్రుచ‌ర్ల చంద్ర‌శేఖ‌ర్ రాజు ఏడాది క్రితం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అంతే కాకుండా మ‌రోమామ శ‌త్రుచ‌ర్ల విజ‌య‌రామ‌రాజు కూడా టీడీపీలోనే ఉన్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌రామ‌రాజు భార్య శ‌శిక‌ళ దేవిని కురుపాం అసెంబ్లీ బ‌రిలో దించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో అత్తా కోడ‌ళ్ళ మ‌ధ్య ఎన్నిక‌ల పోరు త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అలాగే ఒక‌వైపు విజ‌య‌రామ‌రాజు బ‌లంతో పాటు, ఇటీవ‌ల టీడీపీలో చేరిన‌ మాజీ మంత్రి కిషోర్ చంద్ర‌దేవ్‌కు కూడా ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టు ఉంది. దీంతో ఈ ఇద్ద‌రు బ‌డా నేత‌లు వ‌ల్ల పుష్ప శ్రీవాణికి ఇబ్బందులు త‌ప్పవ‌ని విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు.

అయితే తాను ఎలాంటి ప్ర‌లోభాల‌కు లోను కాకుండా, ప్యాకేజ్‌ల కోసం, ప‌ద‌వుల కోసం జెండా మార్చ‌కుండా, ప్ర‌జ‌లు త‌న‌కు ఇచ్చిన ప‌ద‌విని స్వీక‌రించి ఎంతో బాధ్య‌త‌తో ప‌ని చేసిన త‌న‌కే మ‌రోసారి ప్ర‌జ‌లు ఆశీర్వ‌దిస్తార‌ని పుష్ప శ్రీవాణి భావిస్తోంది. మ‌రి వాస్త‌వంగా చెప్పాలంటే కొంచెం వీక్‌గానే ఉన్న కురుపాం నియోజ‌క‌వర్గంలో జ‌గ‌న్ ఎలాంటి వ్యూహాంతో టీడీపీకి చెక్ పెడ‌తార‌నేది ఇప్పుడు ఆశ‌క్తిగా మారింది.