సొంత జిల్లా ‘కడప’లోనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు ఎదురుదెబ్బ తగలనుంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజక వర్గం ఎమ్మెల్యే ‘ ఆదినారాయణ రెడ్డి’ టీడీపీలోకి మారే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా ఆయన్ను తమ పార్టీలోకి లాగాలని టీడీపీ యువ సారధి నారా లోకేష్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కాగా స్థానిక టీడీపీ ఇంచార్జ్ రామసుబ్బా రెడ్డి మాత్రం అందుకు అభ్యంతరం తెలిపినట్లు హైకమాండ్ ఆయన్ను బుజ్జగించేదుకు ఎమ్మెల్సీ పదవితో పాటు మండలి డిప్యూటీ చైర్మన్ పోస్టును కూడా ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఆదినారాయణ రెడ్డి టీడీపీ చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ ఆయనచేత వైసీపీకి రాజీనామా చేయించి ఉప ఎన్నికలు నిర్వహించి విజయం సాదించి కడపలో తమ బలం పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఒకవేళ ఇదే గనక జరిగితే కడపలో జగన్ కు ఎదురు దెబ్బ తగిలినట్లవుతుంది.