బెస్ట్ యాక్టర్ నంది చంద్రబాబుకే ఇవ్వాలట

Thursday, November 23rd, 2017, 04:25:08 PM IST

కొన్ని రోజుల క్రితం నంది అవార్డులను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు ఏ స్థాయిలో వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు లేని విధంగా సైలెంట్ గా ఉండేవారు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరైతే నంది అవార్డులు కాదు సైకిల్ అవార్డులని ప్రభుత్వంపై కామెంట్ చేయడం రాజకీయాల్లో చాలా వివాదాలనే రేపింది. అయితే వివాదం కొద్దీ కొద్దిగా ముగిసిపోతోంది అనుకుంటున్న సమయంలో మళ్లీ ఎవరో ఒకరు కామెంట్ చేసి చర్చనీయాంశంగా మారుస్తున్నారు.

రీసెంట్ గా ఇదే తరహాలో వైసీపీ నేత పార్థసారథి కూడా నంది అవార్డ్స్ పై స్పందిస్తూ.. తెలుగుదేశం పార్టీపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. అంతే కాకుండా అసెంబ్లీలో చంద్రబాబు నటనకు నంది అవార్డులు ఇవ్వాలని చెప్పారు. నంది అవార్డులను చాలా వరకు టీడీపీ మద్దతుదారులకే ప్రకటించారని తెలిపారు. పోలవరం పనులు సాగడం లేదు. నకిలీ విత్తనాలు చాలా వరకు వస్తున్నాయి. ఈ ప్రభుత్వ పాలనలో రైతులు చాలా నష్టపోతున్నారని చెబుతూ.. నష్టపోయిన వారిని కలవాలంటే ప్రభుత్వం చాలా వరకు భయంతో వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు. ఇక కృష్ణా జిల్లా మంత్రులు పై కూడా పార్థసారథి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వారు ఒక దద్దమ్మలు అని చెప్పారు.