మోడీ కాళ్ళు మొక్కబోయిన జగన్.. దాచిపెట్టిన సాక్షి !

Monday, June 10th, 2019, 08:27:56 AM IST

ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ నిన్న తొలిసారి ఏపీకి వచ్చారు. తిరుపతిలో జరిగిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం మోడీని గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రధానిని చూడగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుం వంచేశారు. గవర్నర్, ఇతర భాజాపా నేతలు, మంత్రులతో సహా అంతా ప్రోటోకాల్ మేరకు పుష్ప గుచ్చాలు ఇచ్చి, శాలువాలు కప్పి నమస్కరించి మోడీకి ఆహ్వానం పలికితే జగన్ మాత్రం ఏకంగా కాళ్ళ మీద పడే ప్రయత్నం చేశారు.

ఒకసారి కాదు రెండు సార్లు. ఆ రెండుసార్లు మోడీయే స్వయంగా ఆపి జగన్ భుజం తట్టారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బహిరంగంగానే పరిస్థితి ఇలా ఉంటే
నాలుగు గోడల మధ్యన ఇంకెలా ఉంటుందో అని, ఇది ఖచ్చితంగా భయం వలన వచ్చిన గౌరవమే అని నెటిజన్లు అంటున్నారు. ఇక జగన్ ఛానెల్ సాక్షి చేసిన పని జనాభిప్రాయాన్ని మరింత బలపరిచేదిగా ఉంది. జగన్ మోడీకి పాదాభివందనం చేయడానికి చేసిన రెండు ప్రయత్నాల్ని మాత్రం కట్ చేసి మిగతా వీడియోలను పోస్ట్ చేసింది సాక్షి టీమ్. దీంతో జగన్ చర్యలను సాక్షి సైతం డిఫెండ్ చేయలేకపోయిందని సోషల్ మీడియా మొత్తం గోల గోల చేస్తోంది.