యూట్యూబ్ కిల్లర్స్ : 24 తో నువ్వా నేనా అంటున్న సరైనోడు..!

Tuesday, April 12th, 2016, 01:40:53 PM IST

సూర్యా భయపెట్టేశాడు : తమిళ్ స్టార్ నటుడు సూర్య నటించిన 24 సినిమా ఆడియో సోమవారం రోజున విడుదలైంది. మనం దర్శకుడు విక్రం కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అందించారు. ఇక రెహ్మాన్ మ్యూజిక్ అంటే చెప్పాల్సినది ఏమున్నది. ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సైంటిఫిక్ త్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను భారీగానే నిర్మించారు. ఇక ఆడియోతో పాటు ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ ట్రైలర్ ఇప్పుడు విపరీతంగా ఆకట్టుకుంటున్నది. కేవలం 16 గంటలలోనే 4,71,202 మంది వీక్షించారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

గేమ్ ఆఫ్ త్రోన్ ను ప్రేక్షకులు ఫిదా : హెచ్ బీవో చానల్ ప్రసారం సమర్పిస్తూ ప్రసారం చేస్తున్న గేమ్ ఆఫ్ త్రోన్ సీరిస్ లో భాగంగా ఆరో సీజన్ సీరిస్ ప్రారంభమయింది. దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ ను ఇటీవలే విడుదల చేశారు. యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ టీజర్ కు విశేష స్పందన వస్తున్నది.

వీడియో కోసం క్లిక్ చేయండి

దుమ్ము దులుపుతున్న సరైనోడు : అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సరైనోడు చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. విడుదలైన ఈ ట్రైలర్ ఇప్పుడు బన్ని అభిమానులనే కాకుండా.. మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నది. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సినిమా రూపొందించారు బోయపాటి. అనుకున్న విధంగానే ట్రైలర్ మాస్ ప్రేక్షకులను ఆకర్షించింది. 24 గంటల క్రితం విడుదలైన ఈ ట్రైలర్ ను 7,35,350 మంది వీక్షించడం విశేషం.

వీడియో కోసం క్లిక్ చేయండి