యాదగిరికి ఏటేటా వందకోట్లు

Wednesday, February 25th, 2015, 09:41:43 PM IST


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత యాదగిరి గుట్టను తెలంగాణ తిరుపతిలా తయారుచేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే కెసిఆర్ కొన్ని నిధులను విడుదల చేసిన సంగతి విదితమే. యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు అంగరంగవైభోగంగా ప్రారంభం అయ్యాయి. ఈసందర్భంగా కెసిఆర్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అభివృద్ధి పనుల గురించి వాకబు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ యాదగిరి గుట్ట పరిసర ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం, కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. యాదగిరి పరిసర ప్రాంతాలను అద్బుతంగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఇక, రోడ్ల విస్తరణ కోసం 100కోట్ల రూపాయల నిధులను ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. గుట్ట చుట్టూ ఉన్న చెరువులను కాకతీయ మిషన్ లో భాగంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం యాదగిరి గుట్టకోసం 100కోట్ల రూపాయల నిధులను ఇస్తామని కెసిఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.