వరల్డ్ కప్ ప్రాబబుల్స్ ఎంపిక – యువఆటగాళ్ళకు ప్రాధాన్యం

Thursday, December 4th, 2014, 05:36:21 PM IST


2015లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వరల్డ్ కప్ లో ఆడేందుకు ఇండియా ప్రాబబుల్స్ ను ఎంపిక చేసింది. అయితే.. అనుకున్నట్టుగానే సీనియర్లు సెలక్టర్లు మొండి చెయ్యి చూపించారు. సేహ్వాగ్, గంభీర్, జహీర్ ఖాన్, హర్బజన్ సింగ్, యువరాజ్ సింగ్ లకు చోటు దక్కలేదు. ఇక మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, శిఖర్ థావన్, అజరింకా రేహానే, అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, రోహిత్ శర్మ, సురేష్ రైనాలకు చోటు దక్కింది.

వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో యువకులకు చోటు కల్పించారు. రవీంద్ర జడేజా, భువనేశ్వర్ ప్రసాద్, మహ్మద్ షమీ, వరుణ్ ఆరోన్, అశోక్ దిండా, మురళీ విజయ్, వృద్దిమాన్ సాహా, సంజూ శామ్సన్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, కులకర్ణీ, మనోజ్ తివారి, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, పర్వేజ్ రసూల్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, స్టువర్ట్ బిన్నీ, మొహిత్ శర్మ, కులదీప్ యాదవ్, అమిత్ మిశ్రా, కరణ్ శర్మలకు ప్రాబబుల్స్ లో చోటు దక్కింది.