వరల్డ్ కప్ వేడుకలు ప్రారంభం

Thursday, February 12th, 2015, 03:44:09 PM IST


వరల్డ్ కప్ 2015 వేడుకలు అట్టహాసంగా గురువారం ప్రారంభం అయ్యాయి. వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి రెండురోజుల ముందే అంటే..ప్రారంభ వేడుకలు నిర్వహించాలని ఐసిసి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి. కాగా, రెండు దేశాలలో రెండు వేరు వేరు వేదికలపై ప్రారంభ వేడుకలు నిర్వహిస్తున్నారు. న్యూజిల్యాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లోను, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియంలోను ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు మాజీ క్రికెటర్లతో సహా హాజరవుతున్నారు. అంతేకాకుండా, రెండు దేశాలకు చెందిన ప్రముఖ పాప్ సింగర్స్ ఈ ప్రారంభ వేడుకలలో సందడి చేస్తున్నారు.