పోల్ : వచ్చే ఎన్నికలలో పవన్ తిరిగి మిత్రపక్షంతో చేతులు కలుపుతారా..?

Thursday, May 26th, 2016, 11:50:24 PM IST


2019 లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాయి. ఇక నేటితో మోడీ పాలనకు రెండేళ్ళు పూర్తయ్యాయి. గత ఎన్నికలలో మోడీకి దేశంలోని ప్రజలు సంపూర్ణ మెజారిటీ ఇచ్చి గెలిపించారు. ఈ రెండేళ్ళ పాలనలో మోడీ ప్రభుత్వం చాలానే చేసింది. మంచి పధకాలను ప్రవేశపెట్టింది. అలాగే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక, ఇబ్బందులను ఎదుర్కొంటూనే పధకాలను ప్రవేశపెడుతూ ఏదోలా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఇక, ఇదిలా ఉంటె, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల విషయంలో వెనకడుగు వేస్తున్నదని చెప్పి, మిత్రపక్షం నుంచి బయటకు వచ్చారు. వచ్చే ఎన్నికలలో మరలా తెలుగుదేశం.. బీజేపి మిత్రపక్షానికే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. మరి వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం.. బీజేపితో చేతులు కలుపుతారని ప్రజలు అనుకుంటున్నారో లేదో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.