ఒకవేళ అమితాబ్ అయితే.. పవన్ ఎందుకు కాలేడు..?

Saturday, April 2nd, 2016, 09:36:27 AM IST


త్వరలోనే ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగుస్తుంది. ప్రణబ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయతే, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ఎవరిని రాష్ట్రపతిగా నియమిస్తారు అనే విషయంపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే, సోషల్ మీడియాలో, మీడియాలో అమితాబ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఇటీవలే అమితాబ్ ప్రధాని మోడీని కలిశారు. ప్రధాని మోడీని కలిసిన తరువాత, ఈ విషయంపై చర్చలు మొదలయ్యాయి. అమితాబ్ ఈసారి రాష్ట్రపతి అవుతారని, ఆయనను నియమించేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

అయితే, ఇది అధికారికంగా నిర్ణయం కాలేదు. అమితాబ్ మించిన వ్యక్తులు బీజేపిలో లేరా అంటే ఉన్నారు. వాయ్ పాయి ప్రభుత్వంలో కేంద్ర హొమ్ శాఖమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎల్ కె అద్వాని తో సహా చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. వీరిని కాదని, అమితాబ్ కు ఎన్దీఏ ప్రభుత్వం నియమిస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. ఇకపోతే, ఒకవేళ అమితాబ్ ను ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రపతిగా నియమిస్తే.. వచ్చే ఐదేళ్ళ తరువాత ఎన్డీఏ కనుక అధికారంలో ఉంటె, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను రాష్ట్రపతిగా నియమిస్తుందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ బీజేపికి మిత్రపక్షంగా ఉన్నారు. వెంకయ్య నాయుడికి మోడీకి ఎంతో ఇష్టమైన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్. దీనిని బట్టి చూస్తే.. ఇప్పుడు అమితాబ్ ను రాష్ట్రపతిగా నియమిస్తే.. తరువాత పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రపతి అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి.