మోడీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కి పదవి ఆఫర్ చేస్తుందా.?

Saturday, May 17th, 2014, 05:07:26 PM IST


గత కొద్దినెలలుగా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న 2014 ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. దాంతో ఈ ఉత్కంఠకి తెరపడడమే కాకుండా తెలంగాణ, సీమాంధ్రగా విడిపోయిన రెండు రాష్ట్రాల్లో ఎవరు మొట్ట మొదటి గవర్నమెంట్ ఫాం చేయనున్నారు అనే విషయం కూడా తెలిసిపోయింది. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ, తెలంగాణాలో కెసిఆర్, సీమాంధ్రలో చంద్రబాబునాయుడు తమ ప్రభుత్వాలని ఏర్పాటు చేయనున్నారు.

సీమాంధ్రలో 106 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో గవర్నమెంట్ ఫాం చేయనుంది. కానీ ఈ పార్టీ ఇంత ఆధిక్యంతో ఎలా గెలిచింది? ఈ ఆధిక్యం వెనుక ఉన్న కారణాలు ఏంటనేవి చూసుకుంటే.. తెలుగుదేశం పార్టీ ముందు నుంచే బిజెపి పార్టీతో కలిసి 2014 ఎన్నికల బరిలో దిగింది. దాంతో బిజెపి పార్టీ ప్రధాని అభ్యర్థి అయిన నరేంద్ర మోడీతో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. ఈ మోడీ మానియా సీమాంధ్ర, తెలంగాణలో ఎంపి సీట్స్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించింది.

ఇక సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ మానియా ఒకరకంగా హెల్ప్ అయితే, ప్రజల్లో మార్పును తీసుకొచ్చి దేశ సమగ్రతను కాపాడాలనుకొని పార్టీ స్థాపించిన జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా టిడిపి పార్టీ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో మోడీని, మన రాష్ట్రంలో తెలుగుదేశం – బిజెపి పార్టీ కూటమిని సపోర్ట్ చేయడమే కాకుండా ప్రతి జిల్లాలో జరిగిన బహిరంగసభల్లో పాల్గొని ప్రజలను ఉత్తేజపరిచారు. అది తెలుగుదేశం పార్టీకి చాలా హెల్ప్ చేసింది. ఇలా ఇంతమంది సపోర్ట్ సమగ్ర కృషి వల్ల తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది.

పవన్ కళ్యాణ్ మొదటిసారి కలిసినప్పుడే తన భావాలు నచ్చాయని నరేంద్ర మోడీ పలు సభల్లో కూడా వెల్లడించారు. అలాగే ఈ రోజు ఉదయం నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ద్వారా ‘2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని, కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు’ తెలిపాడు. ఈ సంఘటన తర్వాత ప్రస్తుతం చాలా మంది మదిలో ఉన్న విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ భావాలు నచ్చాయని, అలాగే అతని ప్రచారం చాలా హెల్ప్ అయ్యిందని గుర్తించిన మోడీ తన ప్రభుత్వంలో ఏదైనా స్థానం ఇచ్చి రాజకీయాలలో ప్రోత్సహిస్తారా.? తన మంత్రిత్వ శాఖలో రాజ్యసభ ఎంపీగా ఏమన్నా సీటు ఇస్తారా? అని అందరూ ఆలోచనలో పడ్డారు.

ఇలా చాలామంది భావిస్తున్నట్టే జరిగితే… నరేంద్ర మోడీ ఇలా ఆఫర్ ఇస్తే పవన్ కళ్యాణ్ తీసుకునే అవకాశం ఉందా లేక సున్నితంగా తిరష్కరించి డైరెక్ట్ గా 2019 ఎన్నికల్లో తన జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తాడా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై మీ కామెంట్స్ ని కింద కామెంట్స్ రూపంలో తెలపండి..