2019 కైనా మహేష్ బాబు చంద్రబాబు డీల్ ను ఓకే చేస్తాడా ..?

Wednesday, June 15th, 2016, 11:00:04 AM IST


రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో చెప్పలేం. ఎవరు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఊహించలేం. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అలానే ఉంది. నిన్న మొన నటి వరకూ బాబు వెనుక బాబు వెనుక మోదీ, పవన్, వాళ్ళ వెనుక జనం ఉన్నారనుకున్నాం. కానీ ఇప్పుడు మోదీ బాబుకు సహకరించడం లేదు, పవన్ దోస్తీని కట్ చేస్తున్నాడు. ఈ పరిణామాలతో జనంలో నమ్మకం కూడా సన్నగిల్లుతోంది. దీంతో బాబు పార్టీకి సినీ గ్లామర్ ను చేకూర్చి పవన్ స్థానాన్ని రీప్లేస్ చెయ్యాలని, కేంద్రంలో మోదీ సహకారాన్ని ఎలాగైనా సాదించాలని భావించారు.

అందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో పవన్ ను రీప్లేస్ చేస్తే బాగుంటుందని భావించి మహేష్ బావమరిది, తమ ఎంపీ అయిన గల్లా జయదేవ్ చేత మధ్యవర్తిత్వం కూడా నడిపారు. మహేష్ మాత్రం తన స్వభావానికి పూర్తి భిన్నమైన రాజకీయాల జోలికి వెళ్ళడం ఎందుకులే అనుకున్నాడో ఏమో గాని తన నిర్ణయాన్ని మాత్రం బహిర్గతం చెయ్యలేదు. కానీ ఇప్పటికీ మహేష్ ను రాజకీయాల్లోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మహేష్ ముందు చంద్రబాబు ప్రస్తావన అలానే ఉందని వినికిడి. సో మహేష్ ప్రస్తుతం సినినిమాల్లో బిజీగా ఉన్నా 2019 నాటికైనా ఈ డీల్ ఓకే చేసి టీడీపీ తరపున ప్రచారానికి దిగుతరేమో చూడాలి.