అసలు సీఎం కిరణ్ వ్యూహం ఏంటీ..?

Friday, February 7th, 2014, 11:54:04 AM IST

cm-kiran
రాష్ట్ర విభజన అనివార్యమైన నేపథ్యంలో సిఎం కిరణ్ ఏం చేయబోతున్నారు..? రాజీనామా చేస్తారా..? లేక కొత్త పార్టీ పెడుతారా..? అసలు ఆయన వ్యూహం ఏంటి..? హైకమాండ్ ఆగ్రహంగా ఉన్న టైంలో సిఎం.. ప్యూచర్ ప్లాన్ ఏంటీ..? అనేది రాష్ట్రంలో హట్ టాఫిక్ మారింది.. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతనేతల్లో ఆసక్తి నెలకొంది.

రాష్ట్ర విభజనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన కిరణ్ అదే క్రమంలో అధిష్టాన్నాన్ని ఎదిరించారు. తానే అసలు సిసలైన సమైక్య వాదినంటూ బిల్డఫ్ ఇచ్చుకున్నారు. సీమాంధ్ర ప్రజల్లో తానే హీరో అనిపించుకునేందుకు అనేక స్కెచ్ లు వేశారు. బిల్లు పార్లమెంట్ కు వస్తే రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. అన్ని విధాలుగా హై కమాండ్ ను ఇరుకున పెట్టిన సిఎం ఇప్పుడేం చేయబోతున్నారనేది సమైక్య నేతలకు హట్ టాఫిక్ గా మారింది..

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ డిల్లీలో సీఎం దీక్ష చేయడంపై హైకమాండ్ ఫైర్ విషయాన్ని ఎఐసిసి వర్గాలు లీకులు ఇచ్చాయి. కిరణ్ ను కుర్చీ దించేందుకు అధిష్టానం రెడీ అయ్యిందని.. రాజ్యసభ ఎన్నికల తర్వాత సార్ కు షాక్ ఇవ్వొచ్చని సీనియర్ కాంగ్రస్ నేతలు చెప్తున్నారు. అయితే సీమాంధ్ర మంత్రులు మాత్రం సిఎం ను మార్చే ప్రసక్తే లేదని తేల్చి చేస్తున్నారు.

సీఎం కిరణే మరోసారి అధిష్టానాన్ని ఇరుకున పెట్టేలా ప్లాన్ చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అధిష్టానం ఆదేశాలు ఇవ్వకముందే ఆయనే రాజనామా చేస్తారని అంటున్నారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టాక కిరణ్, మిగత సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భవిష్యత్ చెప్తామంటున్నారు. అంటే కొత్త పార్టీ పెట్టేందుకే సీఎం మొగ్గుచూపుతున్నారనే వాదన ఉంది. మరి సిఎం కొత్త పార్టీ పెడుతున్నారా? అనే మీడియా ప్రశ్నలకు సిఎం సమాధానం ఇవ్వకుండా సీమాంధ్ర ప్రజలు కావాలనుకుంటే ఉండొచ్చన్నారు. సీమాంధ్రలో టీడీపీ, వైసీపీ బలంగా ఉన్నాయి, విభజన జరిగితే కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉంటే మరో కొత్త పార్టీకి అవకాశం ఉంటుంది. దీన్నే సీఎం ఫాలో అవుతున్నారనే టాక్ ఉంది. ఇప్పటికే సీమాంధ్రలో మంచి మైలేజ్ ఉందని కిరణ్ భావిస్తున్నారు.

టీడీపీ, వైసీపీ లపై వ్యతిరేకతతో ఉన్న నేతలు, ఈరెండు పార్టీల్లో చేరలేని వారు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేని నాయకులు, సీఎం కొత్త పార్టీ పెడితే జాయిన్ అవుదామనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఆసక్తితో చూస్తున్నారు. ఎంపీలు రాయపాటి, లగడపాటి, అనంత వెంకటరామిరెడ్డి, సబ్బంహరి, ఉండవల్లి, హర్ష కుమార్.. మంత్రులు టిజీ, ఏరాసు, గంట, పితాని.. పలువురు ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారు. సిఎం డిసైడ్ అయితే కొత్త పార్టీ అవకాశాలు ఖచ్చిగతంగా ఉంటాయని విశ్లేషకులంటున్నారు.

సీఎం వ్యూహం ఎలా ఉండబోతుందనే దానిపైనా సీమాంధ్రలో ఆసక్తి నేలకొంది. హైకమాండ్ వేటు వేసినా, బిల్లు కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చినా.. సమైక్యాంధ్రకు చాంపియన్ గా మిగిలేందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. సీడబ్య్లూసీ నిర్ణయం తర్వాత సీఎం పదవి సైతం కిరణ్ వద్దనుకున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. హైకమాండ్ ను దిక్కరిస్తూ ఆఖరకు ఢిల్లీలో దీక్ష చేశారంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ లు అధికారం కోసం పాకులాడుతుంటే.. తాను మాత్రం ప్రజల కోసం పార్టీ, పదవి వదులుకోడానికి సిద్దపడ్డానంటూ వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చనేది సిఎం వ్యూహంగా కనిపిస్తోంది.

రాష్ట్రంలో రాజకీయ అస్థిరత రాజ్యమేలుతున్నపుడు కిరణ్ సీఎంగా బాధ్యతలు చేపట్టి.. సుస్థిర పాలన అందించారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇండియాటుడే అవార్డు దక్కించుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ ప్రచారాస్త్రాలతో ప్రజల్లోకి వెళ్లాలని వారు భావిస్తున్నారు. మొత్తానికి సిఎం విభిన్న కోణాల్లో స్కెచ్ లు వేస్తున్నారు. అయితే హైకమాండ్ ఆదేశాలతో సిఎం పదవినుంచి వైదొలుగుతారా? లేక ఆయనే రాజీనామా చేస్తారా? సీఎం అనుకున్న ప్లాన్ వర్కవుట్ అవుతుందా..? లేక తుస్ మంటుందా? అనేది వేచి చూడాలి.