ఆ ముగ్గురిలో గెలుపెవరిదో..?

Friday, December 4th, 2015, 12:30:01 PM IST


సినిమా హిట్ కావడానికి.. ఎక్కువ మొత్తంలో వసూలు చేయడానికి ఓవర్సీస్ ఓ మార్గంగా నిలిస్తున్నది. ఓవర్సీస్ లో ఎవరైతే ఎక్కువగా వసూళ్లు సాదిస్తారో.. ఆ సినిమా కమర్షియల్ గా అంత పెద్ద హిట్ సాధించినట్టు. మొన్నటి వరకు స్టార్ హీరోలు ఎక్కువగా ఓవర్సీస్ బాద్ షాలుగా నిలిచేవారు. కొంతకాలం నుంచి చిన్న చిన్న హీరోల చిత్రాలు కూడా ఓవర్సీస్ లో విడుదల అవుతున్నాయి. అందుకు ఉదాహరణే భలే భలే మగాడివో సినిమా.

ఇక, ఇదిలా ఉంటే, ఓవర్సీస్ మార్కెట్లో మహేష్ బాబుకు మంచి మార్కెట్ ఉన్నది. ఆయన నటించిన సినిమాలను ఓవర్సీస్ లో ఎక్కువగా మొత్తంగా కొనుగోలు చేస్తుంది. శ్రీమంతుడు హిట్ తరువాత బ్రహ్మోత్సవం సినిమాను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి. బ్రహ్మోత్సవం సినిమాను 13 కోట్లకు కొన్నారని తెలుస్తున్నది. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను కూడా అంతే మొత్తంలో కొనాలని సర్దార్ నిర్మాత డిమాండ్ చేశారని తెలుస్తున్నది. సర్దార్ గబ్బర్ సింగ్ ను 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని సమాచారం.

అంతేకాకుండా, సమ్మర్ లో బన్నీ సినిమా కూడా రిలీజ్ అవుతున్నది. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సరైనోడు సినిమా ఏప్రిల్ 8న విడుదల కాబోతున్నది. ఈ సినిమా కూడా ఓవర్సీస్ లో మంచి రేటు పలుకుతున్నట్టు సమాచారం. దాదాపు 7 కోట్ల రూపాయలకు సరైనోడు అమ్ముడుపోయినట్టు తెలుస్తున్నది. ఇక సమ్మర్ లో వస్తున్న ఈ మూడు సినిమాలలో ఏ సినిమా ఓవర్సీస్ లో ఎక్కువ వసూలు చేస్తుందో తెలియాలి అంటే సమ్మర్ వరకు ఆగాల్సిందే.