సోనియా ఆదేశంతోనే వచ్చా

Friday, November 6th, 2015, 01:00:19 AM IST


వరంగల్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ ఎంపిక చాలా నాటకీయంగా జరిగింది. నామినేషన్ కు కొద్ది సమయమే ఉందనగా పూర్వం నిర్ణయించిన అభ్యర్థి సిరిసిల్ల రాజ్య ఇంట్లో ఆయన కోడలు, ముగ్గురు మనవలు అనుమానాస్పద స్థితిలో గ్యాస్ సిలిండర్ పేలి చనిపోవడం వలన ఆయన్ను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు. దీంతో ఆయన్ను ఉపఎన్నికల బరి నుండి తప్పించటం వలన సత్యనారాయణకు అవకాశం వచ్చింది. దీని పై సత్యనారయణ మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా స్వయంగా చెబితేనే పోటీలో తానూ పోటీకి దిగుతున్నానని అన్నారు.

బుధవారం కలెక్టరేట్‌లో నామినేషన్ వేసిన అనంతరం పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే నామినేషన్ వేసిన సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. రాజయ్యకు వస్తాయనుకున్న దానికన్నా మూడింతలు ఎక్కువ మెజార్టీ తనకు వస్తుందన్నారు. తనకు పార్టీలో గ్రూపులు లేవని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళతానన్నారు. తాను గెలిచి ఓరుగల్లును అభివృద్ధిబాటలో నడిపిస్తానన్నారు.