నాయకుల తలరాతలు.. కాసేపట్లో..!!

Tuesday, November 24th, 2015, 08:21:26 AM IST

waramgal
వరంగల్ ఉప ఎన్నిక ఈ నెల 20న జరిగిన సంగతి తెలిసిందే. వరంగల్ ఉప ఎన్నిక నియోజక వర్గానికి 23 అభ్యర్ధులు పోటీ చేశారు. 1778 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు. దాదాపు 69.01% ఓటింగ్ నమోదయింది. 15 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నానికి రిజల్ట్ వెలువడుతుంది.

మొత్తం 14 రౌండ్లలో లెక్కింపు ఉంటుందని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. వరంగల్ ఎంపీ నియోజక వర్గానికి సంబంధించి 7 సిగ్మేంట్లలో పోలింగ్ జరిగింది. ఇక, ఈవీఎం బాక్స్ లు ఇప్పటికే వరంగల్ చేరుకున్నాయి. అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపి-టిడిపి, వైఎస్ఆర్ పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఈ నాలుగు పార్టీలు గెలుపు తమదంటే తమదే అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. అయితే, అధికార పార్టీ మాత్రం గెలుపు ఖచ్చితంగా మాదే అంటున్నది. మరి నాయకుల తలరాతలు ఎలా ఉన్నాయో మరికాసేపట్లోనే తేలిపోతుంది.