‘అసెంబ్లీ రౌడీ’ సీన్ రిపీట్ అయ్యింది!

Friday, March 27th, 2015, 10:07:44 AM IST

Assembly
ప్రముఖ హీరో మోహన్ బాబు నటించిన ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా గుర్తుందా? అందులో జైల్లో ఉన్న హీరోను నిర్దోషిగా ప్రకటించేందుకు తమ సాక్ష్యాన్ని ఓటర్లు ఓటుతో పాటు రాసి బ్యాలెట్ బాక్సుల్లో వేస్తారు. దీనితో హీరో గారు ఎన్నికలలో నేగ్గడమే కాకుండా జైలు నుండి కూడా విడుదల అవుతారు. ఇక మరీ ఇంత కరెక్ట్ గా కాకపోయినా ఇంచుమించు ఇదే తరహా సన్నివేశం శాసన మండలి ఎన్నికలలో కూడా చోటు చేసుకుంది. అయితే అక్కడ హీరోకి అనుకూలంగా సాక్ష్యాన్ని ఓటర్లు బ్యాలెట్ పేపర్లపై రాస్తే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై విపరీత వ్యాఖ్యలు చేశారు.

ఇక వివరాలలోకి వెళితే వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటుతో పాటు తమ విమర్శలను కూడా రాసి బ్యాలెట్ బాక్స్ లో వేశారు. ఇక ఓటు స్లిప్ వెనుక ‘ఖబద్దార్ కెసిఆర్… నియంతలా వ్యవహరిస్తున్నావు.. తీరు మార్చుకో… లేకుంటే నీ అంతు చూస్తాం’ అంటూ హెచ్చరికలను రాసి బ్యాలెట్ బాక్సులలో వేశారు. కాగా వీటిని చూసిన కౌంటింగ్ అధికారులు ఒక్కసారి అవాక్కయ్యి అనంతరం వాటిని చించి చెత్తబుట్టలో వేసినట్లు సమాచారం.