రివ్యూ రాజా తీన్‌మార్ : వివేకం – బిల్డప్ తప్ప ఇంకేం లేదు

Thursday, August 24th, 2017, 02:49:53 PM IST

తెరపై కనిపించిన వారు : అజిత్, కాజల్, వివేక్ ఒబెరాయ్
కెప్టెన్ ఆఫ్ ‘వివేకం’ : శివ

మూల కథ :

కౌంటర్ టెర్రరిజం ఏజెన్సీలో పనిచేసే ఏకే (అజిత్ కుమార్) అత్యంత సమర్ధుడైన, తెలివైన ఏజెంట్. ఏ దేశానికీ దొరకని టెర్రరిస్టుల్ని కనిపెట్టి, చంపడం అతని పని. అతనికి ఏజెన్సీ అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ వెపన్స్ ను పేల్చడానికి కావాల్సిన కోడ్ ను కలిగి ఉన్న హ్యాకర్ ను కనిపెట్టే మిషన్ ను అప్పగిస్తుంది.

అజయ్ కుమార్ ఆ మిషన్లో ఉండగా అతని స్నేహితులైన ఆర్యన్ (వివేక్ ఒబెరాయ్), మరో ముగ్గురు నమ్మక ద్రోహంతో అతని వద్ద నుండి కోడ్ ను లాక్కొని అక్రమార్కులకు ఇచ్చేస్తారు. అంతేకాక ఏకేను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా కూడా చిత్రీకరిస్తారు. అలా స్నేహితుల చేతిలో వెన్నుపోటుకు గురైన ఏకే ఎలా తిరిగొచ్చాడు ? తనకి ద్రోహం చేసిన వాళ్ళను అంతం చేసి ఆ కోడ్ ను ఎలా సాధించాడు ? అండ్ తెరపై నడిచే కథ.

విజిల్ పోడు :

–> దర్శకుడు శివ హీరో అజిత్ ను మోస్ట్ పవర్ ఫుల్ రోల్ లో చూపించాడు. ఆటను కనబడే ప్రతి సన్నివేశం ఒక ఇంట్రడక్షన్ లా అనిపిస్తుంది. దీంతో అభిమానులకు ఎంజాయ్ చేయడానికి కావాల్సినంత స్టఫ్ దొరుకుతుంది. కాబట్టి ఈ ఎలివేషన్ సీన్స్ కు అభిమానులు గట్టిగా విజిల్ వేయొచ్చు.

–> హీరో అజిత్ కూడా పెర్ఫార్మెన్స్ కూడా ఇరగదీశాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకునేలా ఉంది. ఆద్యంతం ఫైట్స్, స్టంట్స్ చేస్తూ సినిమా మొత్తాన్ని తన భుజాల మీదే మోశాడు అజిత్. కానుకల రెండవ విజిల్ అతనికి వేసుకోవచ్చు.

–> ఇక చిత్రంలోని విజువల్స్ అత్యున్నత స్థాయిలో ఉండటంతో ప్రతి ఫ్రేమ్ క్లియర్ గా, ఆకట్టుకునే విధంగా అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి విజువల్ ట్రీట్ అనొచ్చు. దీనికిగాను సినిమాటోగ్రాఫర్ వెట్రి మారన్ కు ఆఖరి విజిల్ వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా మొత్తం ఎలివేషన్ సీన్స్ అవడం వలన ఎక్కడా డ్రామా అనేదే కనబడదు. దీంతో సామాన్య ప్రేక్షకులు ఇబ్బందిపడక తప్పదు.

–> సినిమా ఆరంభమైన మొదటి 20 నిముషాలు జరిగేడి ప్రస్తుతమా, గతమా అనేది క్లారిటీ ఉండదు. అలాగే సెకండాఫ్లో హీరో పగ తీర్చుకునే సన్నివేశాలు కూడా ఒకే విధంగా సాగుతూ బోర్ అనిపిస్తాయి.

–> అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరీ లోడ్ గా అనిపిస్తుంది. దర్శకుడు శివ ప్రతి చిన్న విషయాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసినా వాటినీ చూసి అర్థం చేసుకునే సమయం మాత్రం ఆడియన్సుకు ఇవ్వలేదు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> హీరో ఎంత తెలివైన వాడైనా సుమారు 120 దేశాలు కలిసినా అతన్ని పట్టుకోలేకపోవడం అనేది మరీ చిత్రంగానే ఉంటుంది.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : సినిమా ఎలా అనిపించింది ?
మిస్టర్ బి : అన్నీ అజిత్ ఎలివేషన్ సీన్లే కానీ కొంచెం కూడా డ్రామా లేదు.
మిస్టర్ ఏ : అవును. బిల్డప్ తప్ప ఇంకేం లేదు.