ఐ డోంట్ కేర్.. విమర్శలకు విరాట్ కౌంటర్!

Friday, August 3rd, 2018, 06:15:14 PM IST

ప్రపంచ వ్యాప్తంగా రన్ మెషిన్ అని ప్రశంసలు అందుకున్న విరాట్ కోహ్లీపై ఇటీవల కొన్ని విమర్శలు వచ్చాయి. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టులో విరాట్ అంతగా రాణించాడనే ఒక కామెంట్ ఉంది. ఇక ఎవరేమనుకున్నా తాను రికార్డుల కోసం ఆడనని కేవలం జట్టు విజయం కోసమే కష్టపడతాను అని వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 182 పరుగుల వద్ద 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. టెయిలెండర్లతో కలిసి జట్టు స్కోరును సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లాడు.

ఇంగ్లాండ్ గడ్డపై విరాట్ కు ఇది తొలి సెంచరీ. రీసెంట్ గా బిసిసిఐ టివితో మాట్లాడుతూ.. కేవలం జట్టు విజయం కోసం మాత్రమే నా ఆట ఉంటుంది. సెంచరీ కోసం కాకుండా నా వంతు సహకారం అందించాలని ముందే సిద్దమయ్యా. అయితే ఇంకా అనుకున్నంత స్థాయిలో జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్ల లేకపోయా అందుకు కొంత నిరాశకు గురయ్యా. 15 పరుగుల వరకు ఆధిక్యం సాధించాలని అనుకున్నా.. అది కుదరలేదు. నా ప్రిపరేషన్ పట్ల సంతృప్తిగానే ఉన్నా ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ కోహ్లీ తన వివరణ ఇచ్చాడు.