అన్నిటికి కారణం నా భార్యే: విరాట్ కోహ్లీ

Saturday, February 17th, 2018, 11:00:56 PM IST

సౌత్ ఆఫ్రికా గడ్డపై ఎట్టకేలకు ఇండియా జట్టు వన్డే సిరీస్ ను విజయంతో ముగించింది. సఫారీల సొంత గడ్డపై గెలవాలంటే ఎవరికైనా అసాధ్యం. కానీ ఇండియా చాలా ఏళ్ల తరువాత విజయాన్ని అందుకొని చరిత్ర సృష్టించింది. అయితే టెస్టు సిరీస్ కోల్పోవడంతో ముందుకు విమర్శలను ఎదుర్కొన్న ఇండియా వన్డే సిరీస్ ను గెలిచి అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ముందుండి నడిపించిన తీరుకు క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలను అందిస్తున్నారు. మ్యాన్ ఆఫ్ ధీ మ్యాచ్ గుర్తింపు తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా విరాట్ దక్కించుకున్నాడు. అయితే ఈ విజయంలో తన సతీమణికి కూడా భాగమిచ్చాడు విరాట్. మైదానం బయట నుంచి తనకు అండగా నిలిచినా వారి వల్లే అద్భుతంగా ఆడాను. అలాగే నా భార్య అనుష్క శర్మ పాత్ర కూడా నా ఫామ్ కి కారణం. ఈ పర్యటనలో నాకు ఎంతో అండగా నిలిచింది. గతంలో ఎంతో మంది విమర్శలు చేసినప్పటికీ నాకు ప్రేరణగా నిలిచిందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇక రేపటి నుంచి ఇండియా సౌత్ ఆఫ్రికాతో మూడు టీ20 సిరీస్ కు సిద్ధం కానుంది. ఫిబ్రవరి 18 – 24 -24 తేదీలలో మూడు టీ20లు జరగనున్నాయి.