కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతిరాజు గురువారం విజయవాడలో విలేకరుల సమవేశంలో ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన గన్నవరం ఎయిర్ పోర్టు కన్నా బెజవాడ బస్టాండే బాగుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎయిర్ పోర్టులో సౌకర్యాలు ఆశించినంతగా అందుబాటులోకి రాలేదని అశోక్ గజపతి రాజు అభిప్రాయపడ్డారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని తుళ్ళూరు పరిసర ప్రాంతాలలో ఏర్పాటు కాబోతున్న నేపధ్యంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రాధాన్యత లభించిందని తెలిపారు. అలాగే ఈ నేపధ్యంగా గన్నవరం ఎయిర్ పోర్టును త్వరితగతిన అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో గన్నవరంను ఆధునీకరిస్తామని అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు.