రాజకీయాలలో రజనీకన్నా విజయ్ బెటరట !

Monday, November 24th, 2014, 04:52:49 PM IST


మరోసారి తమిళనాడు రాజకీయాలు తెరమీదకు వచ్చాయి. అమ్మ జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజూ ఏదో ఒక కొత్త పదకంతోనో… లేక ప్రతిపక్షాలను విమర్శిస్తునో… లేదంటే ప్రతిపక్షాలే జయలలితను విమర్శించడం వలనో అమ్మ నిత్యం వార్తలలో కనిపిస్తుండేది.అక్రమాస్తుల కేసులో అమ్మ జైలుకు వెళ్లి వచ్చాక… తమిళనాడు రాజకీయాల గురించి అంతగా చెప్పుకునేందుకు ఏమి లేకపోవడంతో ఇన్ని రోజులు నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది.

అయితే… జయలలిత జైలుకు వెళ్ళడం…డిఎంకె పార్టీకి కలిసి వస్తుందని అంతా భావించారు. కాని ఇది తప్పు అని ఇటివలే చేపట్టిన ఓ సర్వే నివేదిక తేటతెల్లం చేస్తున్నది. జయలలిత జైలుకు వెళ్ళడంతో… ఆమె ప్రతిష్ట కాస్త తగ్గిన మాట వాస్తవమే అని కాని.. పార్టీ విషయంలో ఎలాంటి డోకా లేదని సర్వే తెలియజేస్తున్నది. ఇప్పటికిప్పుడు తమిళనాడులో ఎన్నికలు జరిగినా… అన్నాడిఎంకె విజయకేతనం ఎగరవేస్తుందని సర్వేలో తేలింది.

ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా మోడీ హావా స్పష్టంగా కనిపించిన విషయం తెలిసిందే. కాగ…. అమ్మ జైలుకు వెళ్ళాక తమిళ ప్రజలు చూపు బీజేపి వైపుకు మళ్ళిన విషయం తెలిసిందే. ఒకవేళ ఇప్పుడు కనుక ఎన్నికలు నిర్వహిస్తే.. బీజేపికి 9శాతం ఓట్లు సాధించే అవకాశం ఉన్నది. ఇక జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలన బాగుందని 58శాతం మంది ఓట్లు వేస్తె.. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఓటింగ్ శాతం 35కు పడిపోయింది.

అయితే… రజనీకాంత్ ను రాజకీయాలోకి రావాలని తమిళ ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపి కూడా రజనీకాంత్ ను తమ పార్టీలో చేరాలని చాలా సార్లు కోరిన విషయం తెలిసిందే. అయితే.. అది తన చేతుల్లో లేదని మొన్న జరిగిన లింగా సినిమా ఆడియో విడుదల సమయంలో చెప్పిన సంగతి మనం విన్నాం. మరో తమిళ నటుడు విజయ్ రాజకీయాలలోకి వస్తే చూడాలని ఉందని తమిళ ప్రజలు కోరుకుంటున్నారు. తమిళనాడులో విజయ్ కు యుత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నది. వీరంతా రజనీకాంత్ కంటే… విజయ్ రాజకీయాలలోకి వస్తే బాగుంటుందని అంటున్నారు.