రేపిస్టు, బాదితురాలు కలిసిపోయారు.. మధ్యలో వాళ్ళే ఫూల్స్ అయ్యారు..!

Sunday, January 10th, 2016, 01:15:08 PM IST


రేప్ జరిగింది, బాదితురాలు కేసు పెట్టింది, కోర్టు తీర్పునిచ్చింది, రేపిస్టు తప్పు ఒప్పుకుని బాదితురాలిని పెళ్ళాడతానన్నాడు కానీ మధ్యలో మహిళా సంఘాలు దూరి వెర్రివాళ్ళయ్యారు. ఈ విచిత్రమైన ఘటన తమిళనాడు కడలూరు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే కడలూరు జిల్లా తిట్టకుడి సమీపంలోని సౌందర చోళపురానికి చెందిన మోహన్ 2008లో అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేశాడు. దాంతో ఆ బాలిక గర్బవతి అయి ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

దీంతో బాధితురాలు కేసు పెట్టగా కోర్టు అతనికి ఏడేళ్ళు జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. కానీ మోహన్ ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకెళ్ళి బాధితురాలిని పెళ్ళిచేసుకుంటానని అన్నాడు. దీంతో హై కోర్టు బాలికను, మోహన్ ను పిలిచి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోమని తెలిపింది. దీంతో పలు మహిళా సంఘాలు దీన్ని తప్పుబడుతూ పిటిషన్ దాఖలు చేయగా హై కోర్టు తీర్పును వెనక్కు తీసుకుని కేసును విచారించవలసిందిగా కడలూరు కోర్టుకు ఉత్తర్వులు పంపింది. తీరా కేసు కోర్టుకొచ్చి తీర్పు వెలువడే వారం రోజుల ముందు మోహన్, అత్యాచారానికి గురైన మహిళ ఇద్దరూ రిజిస్టర్ వివాహం చేసుకున్నట్లు కోర్టుకు తెలిసింది. దీంతో కధ సుఖాంతమైనప్పటికీ మధ్యలో తలదూర్చి రేప్ చేసి తరువాత పెళ్లి చేసుకుంటే చేసిన తప్పు చెరిగిపోతుందా అని వాదించి న్యాయాన్ని గెలిపిద్దామనుకున్న మహిళా సంఘాలు మాత్రం వెర్రి వాళ్లైపోయారు.